సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కొత్త అనుమానాలు..హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో సీఐ నాగరాజు

by Ajay Maddhiboyina |

విజ‌య‌వాడ రౌడీ షీట‌ర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై సిట్ విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే కేసులో ఇప్పుడు కొత్త అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కొత్త అనుమానాలు..హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో సీఐ నాగరాజు
X

దిశ‌, వెబ్ డెస్క్: విజ‌య‌వాడ రౌడీ షీట‌ర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో విచార‌ణ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ కేసుపై సిట్ విచార‌ణ‌కు ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే కేసులో ఇప్పుడు కొత్త అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న సీఐ నాగరాజును ఇప్ప‌టికే సస్పెండ్ చేయ‌గా ఈరోజు ఆయ‌న్ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు సీఐ నాగ‌రాజు మూడు రోజులుగా కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఉంటున్న‌ట్టు తెలుస్తోంది. కోర్టు కానిస్టేబుల్ ఇంట్లో నాగ‌రాజు ఉండ‌టంపై అన‌మానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈరోజు నాగ‌రాజును అరెస్ట్ చేస్తార‌నే స‌మాచారంతో ఆయన ఇంటివ‌ద్ద‌కు భారీగా అనుచ‌రులు చేరుకున్నారు. నాగరాజును అరెస్ట్ చేయవద్దని, సేవ్ నాగరాజు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఈ కేసులో నాగరాజుతో పాటు టాస్క్ ఫోర్స్ ల‌త కుమారి, టాస్క్ ఫోర్స్ సీఐ శ్రీధ‌ర్ సైతం విచార‌ణ ఎదుర్కొంటున్నారు. సీఐ నాగ‌రాజు త‌న కుమారుడిని హ‌త్య చేశాడు అంటూ సాయికృష్ణ త‌ల్లి చెబుతోంది. సాయికృష్ణ‌ను లాక‌ప్ డెత్ చేసి బాడీని మాయం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. క‌నీసం త‌న కుమారుడి బూడిద అయినా ఇవ్వాల‌ని క‌న్న‌త‌ల్లి త‌ల్ల‌డిల్లుతోంది.

Next Story