- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు దుర్మరణం
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని జల్పాయ్‌గురి (Jalpaiguri) వద్ద ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని వెనుక నుంచి వచ్చిన ఉత్తర బెంగాల్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NBSTC) బస్సు అతివేగంతో బలంగా ఢీకొట్టింది. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉండగా.. మితిమీరిన వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. బస్సు లారీని ఢీకొట్టిన తీవ్రతకు మందు భాగం అంతా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే మరణించగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో 17 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
పోలీసుల సహాయక చర్యలు..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. సమాచారం అందుకున్న జల్పాయ్‌గురి పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. బస్సు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీశారు. గాయపడిన 23 మందిని హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.






