- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND A vs SL A: లంక బౌలర్లకు ముచ్చెమటలు.. వైభవ్ సూర్యవంశీ సెంచరీ మిస్
ట్రై-నేషన్ వన్డే సిరీస్ ఫైనల్లో భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వీరవిహారం చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సంచలనం సృష్టించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న లంక జట్టు బౌలర్లను ముచ్చెమటలు పట్టించేశాడారు. భీకర షాట్లతో తొలి బంతి నుంచి సూర్యవంశీ రెచ్చిపోయాడు.
మరో ప్రపంచ రికార్డు బ్రేక్..
ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పురుషుల ‘లిస్ట్-ఏ’ (List A) క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకుని రికార్డు సృష్టించాడు. అక్కడితో ఆగకుండా లంక బౌలింగ్‌ను ముక్కలు చేస్తూ కేవలం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు సాధించాడు. కేవలం 6 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయి, సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా మెరుపు బ్యాటింగ్‌తో 29 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ ‘ఎ’ జట్టు కేవలం 14.3 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అదేవిధంగా భారత ఇన్నింగ్స్‌ను ఆరంభంలో టీ20 కంటే వేగంగా నడిపించిన ఓపెనర్లు ఇద్దరూ తక్కువ వ్యవధిలోనే అవుట్ కావడంతో మ్యాచ్ కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ తిలక్ వర్మ (9), రుతురాజ్ గైక్వాడ్ (5) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. శ్రీలంక బౌలర్లలో దులజ్ సముదిత, సహన్ అరాచ్చిగే చెరో వికెట్ దక్కింది.






