VIRAL: మాజీ మేయర్ అవినీతి.. ఇంట్లో ఏకంగా 13.5 టన్నుల బంగారం

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-03 02:50:22  IST  )

చైనా (China)లోని హైకౌ (Haikou) నగర మాజీ మేయర్ జాంగ్ క్యూపై అవినీతి ఆరోపణలు భారీ సంచలనం రేపుతున్నాయి.

VIRAL: మాజీ మేయర్ అవినీతి.. ఇంట్లో ఏకంగా 13.5 టన్నుల బంగారం
X

దిశ, వెబ్‌డెస్క్: చైనా (China)లోని హైకౌ (Haikou) నగర మాజీ మేయర్ జాంగ్ క్యూపై అవినీతి ఆరోపణలు భారీ సంచలనం రేపుతున్నాయి. 2019లో జాతీయ పర్యవేక్షణ కమిషన్ (National Monitoring Commission) దర్యాప్తులో భాగంగా జాంగ్ క్యూ నివాసంలోని రహస్య బేస్‌మెంట్‌లో 13.5 టన్నుల బంగారం లభ్యమైంది. ఈ బంగారం విలువ ఆ సమయంలో సుమారు 500 నుంచి 600 మిలియన్ డాలర్లకు పైగా ఉందని అంచనా. అంతేకాకుండా, మిలియన్ల యువాన్ నగదు, పురాతన వస్తువులు, విదేశాల్లో లాసవంతమైన భవనాలు, భూములు కూడా ఆయన పేరుమీద ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 23 టన్నుల నగదు కూడా ఉన్నట్లుగా ఎన్ఎంసీ అధికారులు ప్రస్తావించారు. అయితే, ఈ ఉదంతం 2019లో జరిగినప్పటికీ ఆయన ఇంట్లో నిల్వ చేసిన బంగారం, నగదు నిల్వల ఫొటోలు ప్రస్తుతం అనూహ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కాగా, జాంగ్ క్యూ 2005 నుంచి 2019 వరకు వివిధ పదవుల్లో కొనసాగుతూ భూమి కేటాయింపులు, ప్రాజెక్టులు, కాంట్రాక్టుల ద్వారా భారీ లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ద్వారా సేకరించిన అక్రమ ఆస్తులు బిలియన్ల డాలర్లలో ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు తర్వాత జాంగ్ క్యూ 2020లో పార్టీ సభ్యత్వం, పదవి నుంచి బహిష్కరణకు గురయ్యారు. తరువాత కోర్టు విచారణలో ఆయనకు 1.07 బిలియన్ యువాన్ల అంతకంటే ఎక్కువ లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. చివరకు 2020 డిసెంబరులో జీవిత ఖైదు శిక్ష విధించారు.

Next Story