VIRAL: భోజన ప్రియులకు బంపరాఫర్.. నెలంతా ఫ్రీ ఫుడ్ అంట!

by Kema Shiva Kumar |

గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు మూతపడుతున్న వేళ.. అశ్వారావుపేటలో ఓ హోటల్ యజమాని వినూత్న ఆఫర్ ప్రకటించాడు.

VIRAL: భోజన ప్రియులకు బంపరాఫర్.. నెలంతా ఫ్రీ ఫుడ్ అంట!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల కొరత సామాన్యులనే కాదు, హోటల్ యజమానులను కూడా బెంబేలెత్తిస్తోంది. గ్యాస్ అందక వంట పొయ్యిలు వెలవెలబోతుండటంతో చాలా చోట్ల హోటళ్లు మూతపడుతున్నాయి. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఓ హోటల్ యజమాని పెట్టిన ఆసక్తికర ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వినూత్న ఆలోచన.. అదిరే ఆఫర్

వ్యాపారం సజావుగా సాగాలంటే తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్లు కావాల్సిన పరిస్థితి ఉంది. అయతే, మార్కెట్‌లో గ్యాస్ దొరకడం గగనమైపోవడంతో, సదరు హోటల్ యజమాని ఓ వినూత్న ఆలోచనకు తెరలేపాడు. ‘మాకు ఒక గ్యాస్ సిలిండర్ తెచ్చి ఇవ్వండి.. మీకు నెల మొత్తం ఉచితంగా భోజనం, టిఫిన్ పెడతాం’ అంటూ తన హోటల్ ముందే పెద్ద బ్యానర్ కట్టేశాడు. గ్యాస్ సంక్షోభం కారణంగా హోటల్‌ను మూసేయడం ఇష్టం లేక, ఎలాగైనా సిలిండర్లు సంపాదించాలనే ఉద్దేశంతో అలా ఓపెన్ ఆఫర్ పెట్టినట్లుగా హోటల్ నిర్వాహకుడు తెలిపారు. ఈ వింత ఆఫర్ ఉన్న ఫ్లె్క్సీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘గ్యాస్ సిలిండర్ ఇప్పుడు బంగారం కంటే విలువైపోయింది’.. ‘ఇది కదా అసలైన బిజినెస్ మైండ్ అంటే!’ అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

Next Story