Viral: గుండెపోటుతో కూర్చీలోనే కుప్పకూలిన 8 ఏళ్ల బాలిక.. వీడియో వైరల్

by Ramesh Goud |
Viral: గుండెపోటుతో కూర్చీలోనే కుప్పకూలిన 8 ఏళ్ల బాలిక.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: స్కూల్లో గుండె పోటుతో 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన గుజరాత్(Gujarath) లో జరిగింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృష్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అహ్మదాబాద్(Ahmadabad) లోని ఓ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న గార్గి అనే విద్యార్థిని అస్వస్థతకు గురై క్లాస్ ముందు చైర్ పై కూర్చుంది. అకస్మాత్తుగా గుండె పోటుకు గురి కావడంతో ఒక్కసారిగా చైర్ లోనే కుప్పకూలిపోయింది. ఇంతలో పక్కన ఉన్న టీచర్లు గమణించి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్(Viral) గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పసి వయస్సులో ప్రాణాలు కోల్పోయిందని, వ్యాదులకు కూడా చిన్నా పెద్దా లేకుండా రోజులు మారిపోయాయని భావోద్వేగంతో కూడిన కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story