వైరల్ అవ్వాలని మేకప్ టేస్ట్ చేస్తూ వీడియోలు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-06 11:03:58  IST  )

ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలనే కోరిక ఉండటం సహజం. తమ అందం తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కూడా చాలా మంది అమ్మాయిలు నమ్ముతారు

వైరల్ అవ్వాలని మేకప్ టేస్ట్ చేస్తూ వీడియోలు.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాకవుతారు!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి అమ్మాయికి అందంగా కనిపించాలనే కోరిక ఉండటం సహజం. తమ అందం తమలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని కూడా చాలా మంది అమ్మాయిలు నమ్ముతారు. అందుకే మేకప్ (Makeup) వేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఇందుకోసం ఫౌండేషన్, కాజల్, ఐలైనర్, లిప్‌గ్లోస్.. ఇలా మార్కెట్‌లో వందల రకాల మేకప్ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని ఎంచుకొని ఉపయోగించడం, వాటి గురించి తెలుసుకోవడం, రకరకాల టెక్నిక్స్‌ను ఫాలో అవడం ఇప్పుడు రోజువారీ జీవితంలో భాగమైపోయింది. ఈ క్రమంలో చాలా మంది మేకప్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో (Social media) మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఫాలోవర్లను పెంచుకునేందుకు నెట్టింట వైరల్ (Viral) అవ్వాలని మేకప్ ప్రొడక్స్‌తో వింత వింత ప్రయోగాలు కూడా చేస్తున్నారు. తైవాన్‌కు చెందిన ఓ యువ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా మేకప్ ప్రొడక్స్‌తో ప్రయోగాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. కానీ, చివరికి ఆ పనే ఆమె ప్రాణాలు కొల్పోయేలా చేసింది. ఇంతకీ ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన పనేంటో ఇక్కడ తెలుసుకుందాం.

తైవాన్‌కు (Taiwan) చెందిన 24 ఏళ్ల ముక్‌బాంగ్‌ మేకప్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్లతో, సింపుల్ చిట్కాలతో ఫన్నీ కామెంట్లతో మేకప్ ఎలా వేసుకోవడం చూపించే విధానానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే, నార్మల్‌గా మేకప్ వేసుకుంటూ తన ప్రత్యేకత ఏముంది అనుకుందేమో మధ్య మధ్య వాటిని టేస్ట్ చేయటం ప్రారంభించింది. 'ఈ ఫౌండేషన్ టేస్ట్ బాగోలేదు', 'లిప్‌గ్లోస్ వాసన చాలా స్ట్రాంగ్!' అంటూ కామెడీ కలిపి వీడియోలు చేస్తూ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. దీంతో ముక్‌బాంగ్‌కు పాపులారిటీ పెరిగింది, ఫాలోవర్స్ భారీగా పెరిగారు. ఫలితంగా బ్రాండెడ్ కంపెనీలు కూడా ఆమెతో ప్రమోషన్‌ కోసం సంప్రదించటం మొదలుపెట్టాయి.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, ఆ మేకప్‌ ఉత్పత్తులను టేస్ట్‌ చేయడమే ఆమె పాలిట శాపమై ప్రాణాలను కోల్పొయేలా చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. అక్కడ చికిత్స పొందుతుండగానే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే, ఆమె మరణానికి గల ఖచ్చిత కారణం తెలియాల్సి ఉన్నప్పటికీ, మేకప్ టేస్ట్ చేయడం వల్ల ప్రమాదకరమైన కెమికల్స్‌ శరీరంలోకి వెళ్లి చనిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో ముక్‌బాంగ్ మరణ వార్త వైరల్ అవ్వటంతో డెర్మటాలజిస్టులు, స్కిన్ కేర్ నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని సూచిస్తున్నారు. మేకప్‌ ప్రొడక్ట్స్‌లో వాడే కెమికల్స్‌ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవని, అలాంటి వాటిని టేస్ట్‌ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. మేకప్ ఉత్పత్తులు తినేలా ఎప్పుడు ట్రీట్ చేయొద్దని, అవి తినడం వలన అనేక రకాల విష ప్రభావాలు కలగొచ్చని చెబుతున్నారు. అంతేగాదు మేకప్‌ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలన్నారు. అలాగే మేకప్‌తో అలానే అస్సలు పడుకోవద్దని.. ఎంత ఆలస్యమైనా దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు.

Next Story