Vande Bharat: వందేభారత్ రైల్లో వాటర్ ఫాల్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Vande Bharat: వందేభారత్ రైల్లో వాటర్ ఫాల్..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం (Vande Bharat train) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ రైల్వేలోనే అత్యాధునిక రైళ్లుగా ఇవి గుర్తింపు పొందాయి. అయితే, సాధారణ వాటి మాదిరిగానే భారతీయ రైల్వే ఈ రైళ్ల నిర్వహణను కూడా గాలికి వదిలేసినట్లు తాజాగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎందుకంటే.. తాజాగా ఢిల్లీకి వెళ్తున్న 22415 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఏసీ డెక్ నుంచి వాటర్ లీకేజ్ (water leakage) కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వాటర్ లీకేజీ కారణంగా ప్రయాణికుల లగేజీ సైతం తడిసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

‘ఇప్పుడు వందే భారత్ రైలు ప్రయాణీకుల కోసం వాటర్ ఫాల్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మీరు స్నానం చేస్తూ ప్రయాణించవచ్చు. ఇదంతా 'వారి' డైనమిక్ మార్గదర్శకత్వంలో సాధ్యమైంది. ధన్యవాదాలు చెప్పండి’ అంటూ (@ranvijaylive) రణవిజయ్ సింగ్ అనే ఎక్స్ యూజర్ నెట్టింట వీడియో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. 2024లో కూడా ఓ వందే భారత్‌ రైలులో వాటర్ లీకేజీ జరిగినట్లు గత వీడియోలను సైతం కామెంట్ రూపంలో నెటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఇండియన్ రైల్వేకు వీడియోను నెటిజన్‌లు ట్యాగ్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Next Story