- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ నటిపై పాక్ ప్రధాని వంకర చూపులు..వీడియో వైరల్
నటిపై పాక్ ప్రధాని వంకర చూపులు..వీడియో వైరల్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ నటిపై వంకర చూపులు చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ గవర్నర్ హౌస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నటిపై పాక్ ప్రధాని వంకర చూపులు..వీడియో వైరల్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ నటిపై వంకర చూపులు చూసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ గవర్నర్ హౌస్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 2023లో ఇది జరగ్గా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా షహెబాజ్ షరీఫ్ మార్వా హోకేన్ అనే నటికి అవార్డును ప్రధానం చేశారు. నటి అవార్డు తీసుకుని వెళుతుండగా షరీఫ్ ఆమె వైపే తిరిగి వంకర చూపులు చూశారు. కాగా తాజాగా ఈ వీడియోను పాకిస్థాన్ యూన్యూస్ టీవీ పోస్ట్ చేసింది.
అంతే కాకుండా వీడియోకు షహబాజ్ షరీఫ్ డీప్ స్కాన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దాదాపు రెండేళ్ల తరవాత ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో వీడియోపై మీమ్స్, వీడియోలు చేసి పాక్ ప్రధానిపై క్రియేటర్లు సెటైర్లు వేస్తున్నారు. ఓ ముఖ్యమైన పదవిలో ఉండి షహబాజ్ షరీఫ్ ఇంత చీప్‌గా వ్యవహరిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే నటి మావ్రా హోకేన్ బాలీవుడ్ లోనూ సినిమాలు చేశారు. 2016లో ఆమె సనమ్ తేరీ కసమ్ చిత్రంలో నటించారు. ఇండియా పాక్ ఉద్రిక్తతల కారణంగా ఆమెతో పార్ట్ 2లో నటించను అని ఆమె కోస్టార్ హర్షవర్దన్ రానే ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆమె వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.






