- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ వైపు బెల్లీ డ్యాన్స్.. మరోవైపు నిప్పు రవ్వలు.. గోవా నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది ఇలా! వైరల్
గోవాలోని ఓ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: గోవాలోని ఓ నైట్ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు పర్యాటకులతో స్టాఫ్ సిబ్బంది 25 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో కన్పిస్తున్న ప్రకారం.. షోలే సినిమాలోని ‘మెహబూబా ఓ మెహబూబా’ పాటకు ఓ డ్యాన్సర్ బెల్లీ డ్యాన్ చేస్తోంది. ఆమె పక్కనే సంగీత కళాకారులు బ్యాండ్ వాయిస్తుండగా ప్రేక్షకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. మరోవైపు ప్రేక్షకులు ఫోన్‌లలో డ్యాన్సర్ చేసే బెల్లీ నృత్యాన్ని రికార్డు చేస్తున్నారు. ఈ స్టేజ్ షో జరుగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా రూఫ్ నుంచి నిప్పు రవ్వలు కిందకి పడటం మొదలైన దృశ్యాలు కన్పించాయి. దీన్ని సిబ్బంది అప్పటికీ గమనించలేదు. చిన్నగా మొదలై.. మెల్లమెల్లగా మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ప్రేక్షకులు మంటలు వస్తున్నాయని చెప్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించాయి. దీంతో మ్యూజిక్‌ను నిలిపేయడంతోపాటు.. అక్కడున్న వారంతా బయటకు వెళ్లి పోయే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే, ఇక్కడ షార్ట్ సర్క్యూట్‌తో నిప్పు రాజుకుని.. నిమిషాల వ్యవధిలో మొత్తం క్లబ్ అంతా విస్తరించిందని వీడియో ఆధారంగా అధికారులు ప్రమాదంపై అంచనా వేశారు. అధికారుల సమాచారం ప్రకారం.. మొదటి అంతస్తులో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో డ్యాన్స్ షో జరుగుతున్న ఫ్లోర్‌లో దాదాపు 100 మంది ఉన్నారు, చిన్న తలుపులు, ఇరుకు మార్గం ఉండడంతో త్వరగా కస్టమర్లు బయటకు రాలేకపోయారని తెలిసింది. అలాగే కొంత మంది గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న కిచెన్‌లోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు.. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు మొదట అనుమానం వ్యక్తం చేయడం, ప్రస్తుతం ఈ వీడియో విడుదల కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా, ఉత్తర గోవాలోని అర్పోరాలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్‌లో జరిగిన ఈ అగ్నిప్రమాదం దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. వీడియో ఇదే..






