- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ బిల్డ్ క్వాలిటీతో ప్రమాదం జరిగితే..? మారుతీ సుజుకీ కారు బంపర్‌ను నోటితో పీకేసిన కుక్క.. వీడియో వైరల్
మారుతీ సుజుకీ వాహనాల బిల్డ్ క్వాలిటీపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మారుతీ సుజుకీ వాహనాల బిల్డ్ క్వాలిటీపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ కుక్క, ఎలుకను వెంబడించే క్రమంలో మారుతీ సుజుకీ XL6 కారు ముందు బంపర్‌ను నోటితో ఈజీగా పీకేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. గుర్తు తెలియని ప్రాంతంలో చిత్రీకరించిన ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్‌లో వీడియోగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. మారుతీ సుజుకీ XL6 కారులో బంపర్ వద్ద ఎలుక ఉండటంతో.. దాన్ని తినేందుకు వచ్చిన కుక్క బంపర్‌ను పూర్తిగా పళ్లతో పీకేస్తుంది. అనంతరం ఎలుకను పట్టుకోని వెళ్లిపోతుంది.
బంపర్ కేవలం పళ్లతో లాగగానే విడిపోవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతూ, కంపెనీ బిల్డ్ క్వాలిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ సాధారణ కుక్క నోటికే ఇంత సులభంగా బంపర్ ఊడిపోతే, ప్రమాద సమయంలో ఈ వాహన భద్రత ఎలా ఉంటుందన్న ప్రశ్నలు నెట్టింట నిండా వినిపిస్తున్నాయి. వినియోగదారుల సేఫ్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. మారుతి కార్లు ఎంత గట్టివో ఇకనైనా వాటి కొనుగోలుదారులు అర్థం చేసుకోవాలని తన చర్యతో ఆ కుక్క సలహా ఇస్తున్నట్లు ఉందని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. టూత్ పేస్ట్ వాడకపోతే పళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఉంటాయా..? అని ఓ నెటిజన్ సెటైర్లు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రేమికుల మధ్య చర్చనీయాంశంగా మారి, మారుతీ సుజుకీ వాహనాల బాడీ స్ట్రెంగ్త్ గురించి మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాగా, మారుతీ సుజుకీ XL6 కారు నెంబర్ చూస్తే గోవాలో రిజిస్టర్ అయిన బండిల కన్పిస్తోంది. ట్వీట్ ఇదే..






