Ganpati Toll Gate: గణపతి టోల్ టాక్స్! వినాయక చవితి స్పెషల్‌ చందాలు.. వీడియో వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-08-16 08:41:51  IST  )

భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లలో ఆకట్టుకునే వినాయక విగ్రహాల కొనుగోలు ప్రారంభం అయ్యాయి.

Ganpati Toll Gate: గణపతి టోల్ టాక్స్! వినాయక చవితి స్పెషల్‌ చందాలు.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వినాయక చవితి (Ganesh Chaturthi) వేడుకల సందడి ప్రారంభమైంది. భాగ్యనగరంలోని అన్ని మార్కెట్లలో ఆకట్టుకునే వినాయక విగ్రహాల కొనుగోలు ప్రారంభం అయ్యాయి. గత రెండు, మూడు రోజుల నుంచే వినాయక విగ్రహాలను మండప నిర్వాహకులు తీసుకెళ్తున్న దృశ్యాలు రోడ్లపై కన్పించాయి. ఈ నెల27న వినాయక చవితి (గణేష్ చతుర్థి)న పండుగను జరుపుకోనున్నారు. ఇక, వినాయక చవితి స్పెషల్ చందాలు వసూలు మొదలైనట్లు తెలుస్తోంది. గణేష్ మండపాల ఏర్పాటు, వినాయక విగ్రహం, ఇతర కార్యక్రమాల కోసం కొంత మంది నిర్వాహకులు చందాలు (chanda) వసూలు చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో చిన్న పిల్లల గణపతి టోల్‌గేట్ వీడియో నెట్టింట చర్చానీయంశంగా మారింది.

వీడియోలో చూపించిన ప్రకారం.. కాలనీల్లో పిల్లలు రోడ్లపై కర్రలతో చిన్న టోల్‌గేట్లు (Ganpati Toll Gate) ఏర్పాటు చేసి, వాహనదారులను ఆపి గణపతి చందాలు వసూలు చేశారు. బైక్‌లు, ఆటోలను ఆపడం, చిన్న మొత్తంలో చంద వసూలు చేసిన తర్వాత గేటు ఎత్తేయడం చేస్తున్నారు. డిజిటల్ పేమెంట్‌కు సైతం పిల్లలు ఒకే చెబుతున్నారు. ఇక పిల్లలు ఇలా టోల్‌గేట్ ఏర్పాటు చేయడంపై వావానాదారులు ఇబ్బంది పడకుండా సరదాగా తీసుకున్నట్లు వీడియోల్లో కన్పిస్తోంది. కొంతమంది వాహనదారులు మాత్రం పిల్లలకు నచ్చజెప్పి చందాలు ఇవ్వకుండా ఎస్కేప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

గణపతి టోల్‌గేట్, గణపతి టోల్ టాక్స్ అంటూ యూజర్లు వీడియోలు నెటిజన్‌లు షేర్ చేశారు. వినాయక చవితి సందర్భంగా చిన్నారులు ఇలా వినూత్న చందా వసూలు పద్ధతి పండుగ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. పిల్లలకు ఇలాంటి పనులను ప్రోత్సహించ వద్దని, భవిష్యత్‌లో తప్పుడు మార్గం ఎంచుకునే ఛాన్స్ ఉందని చాలా మంది నెటిజన్‌ల కామెంట్స్ హైలెట్‌గా నిలిచాయి. వైరల్ వీడియో..

Next Story