- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Venezuela: ఎలన్ మస్క్‌కు షాకిచ్చిన వెనిజులా ప్రెసిడెంట్.. దేశ వ్యాప్తంగా ‘X’ సేవలు నిషేధం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల తరువాత దేశంలో చెలరేగుతున్న హింస నేపథ్యంలో వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా ‘X’ (ట్విట్టర్) సేవలను పది రోజుల పాటు నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా విద్వేశపూరిత పోస్టులు అందరిలోనూ అశాంతిని కలిగిస్తున్నాయని మడురో ఫైర్ అయ్యారు. అదేవిధంగా మేటా ఆధ్వర్యంలో కొనసాగుతోన్న వాట్సాప్ సర్వీసును కూడా ఎవరూ వాడొద్దంటూ మడురో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవల జరిగిన వెనుజులా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్ మస్క్, మడురోకు ప్రత్యర్థి అయిన ఎడ్మండో గొంజాలెజ్‌కు సపోర్ట్ చేయడంతో ఇద్దరి మధ్య విభేధాలు తారా స్థాయికి చేరాయి.
అనంతరం జరిగిన ఎన్నికల్లో మడురో విజయం సాధించగా.. ఆయన గెలుపుపై విపక్షాలు ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించాయి. ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని వెంటనే మడురో తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గుంజాలెజ్ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ నిరననకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ అల్లర్లలో సుమారు 23 మందిపైగా మృతి చెందారు. ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టులు పెడుతుండటంతో 10 రోజుల పాటు ట్విట్టర్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రెసిడెంట్ మడురో ప్రకటించారు.