ప్రమాదంలో పసి ప్రాణాలు.. తల్లిపాలలో యురేనియం!

by Muthe.Rajitha |

అప్పుడే పుట్టిన పసి పిల్లల నుంచి రెండేళ్లలోపు పిల్లల వరకు తల్లిపాలను మించిన పోషకాహారం మరొకటి లేదని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు.

ప్రమాదంలో పసి ప్రాణాలు.. తల్లిపాలలో యురేనియం!
X

దిశ, వెబ్ డెస్క్ : అప్పుడే పుట్టిన పసి పిల్లల నుంచి రెండేళ్లలోపు పిల్లల వరకు తల్లిపాలను మించిన పోషకాహారం మరొకటి లేదని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎన్ని ఎక్కువ రోజులు తల్లిపాలు తాగితే అంత ఇమ్యూనిటీ సిస్టమ్ అభివృద్ధి చెందుతుందని సూచిస్తుంటారు. అయితే విపరీతంగా పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులు ఆ తల్లిపాలే పసిబిడ్డల ప్రాణాలకు గండం కాబోతున్నాయి. తల్లిపాలు పసివాళ్ళను పెను ప్రమాదంలోకి నెట్టేసే పరిస్థితి రాబోతుందని తెలుస్తోంది.

ఇంతకీ ఏమైందంటే.. తల్లిపాలలో యురేనియం ఆనవాళ్లు గుర్తించారు శాస్త్రవేత్తలు. బీహార్ లో ఎక్కువ గనులు ఉన్న ప్రాంతాల్లో తల్లుల పాలల్లో యురేనియం ఆనవాళ్లు 5ppb పర్ మిలియన్ ఉన్నట్టు బాంబు పేల్చారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే ఇది తక్కువే అయినప్పటికీ.. భవిష్యత్తులో దీని మోతాదు పెరగవచ్చని భారత NMDA నిపుణులు హెచ్చరించారు. అయితే అక్కడి తాగునీటి స్థాయిలో మాత్రం కనీస ప్రయాణాల కంటే 6 శాతం ఎక్కువగా యురేనియం ఆనవాళ్లు లభించడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story