ఇంత వైలెంట్ ఉన్నావేంట్రా.. లవర్ ఫోన్ బిజీ వస్తుందని ఏం చేశాడంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-30 15:26:16  IST  )

ల‌వ‌ర్ ఫోన్ బిజీ వ‌చ్చిందని ఆ గ్రామం మొత్తానికి ఓ యువ‌కుడు క‌రెంట్ క‌ట్ చేశాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇంత వైలెంట్ ఉన్నావేంట్రా.. లవర్ ఫోన్ బిజీ వస్తుందని ఏం చేశాడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ల‌వ‌ర్ ఫోన్ బిజీ వ‌చ్చిందని ఆ గ్రామం మొత్తానికి ఓ యువ‌కుడు క‌రెంట్ క‌ట్ చేశాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో వివ‌రాలు పేర్కొన‌లేదు కానీ టీవీ 1 ఇండియా లైవ్ అనే ఇన్ స్టా పేజీ వీడియోను షేర్ చేసింది. వీడియోలో యువ‌కుడు త‌న చేతిలో పెద్ద క‌ట‌ర్ ప‌ట్టుకుని విద్యుత్ స్థభంపై కూర్చుకున్నట్టు క‌నిపిస్తోంది.

త‌న చుట్టూ చాలా వైర్లు ఉన్న‌ప్ప‌టికీ లెక్క చేయ‌కుండా క‌ట‌ర్ తో తీగ‌ల‌ను క‌త్తిరిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయ‌క‌పోవ‌డం, ఇంటి నుండి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతోనే యువ‌కుడు తీగ‌ల‌ను క‌ట్ చేసిన‌ట్టు పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నావేంట్రా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, మరో నెటిజన్ లవర్ బిజీ వస్తే వాళ్ల ఇంటికి కట్ చేయాలి కానీ మొత్తం గ్రామానికే పవర్ కట్ చేయడం ఏంటి సామీ అని కామెంట్ చేశాడు. video

Next Story