పెళ్లి కొడుకు మెడలో యూపీఐ స్కానర్.. కట్నాలు ఇలా కూడా చదివిస్తారా?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-17 10:53:53  IST  )

ప్ర‌స్తుతం ఎవ‌రూ కూడా డ‌బ్బులు జేబులో పెట్టుకోవ‌డంలేదు. ప్ర‌తి ఒక్క‌రూ డిజిట‌ల్ క‌రెన్సీ వాడేందుకే అల‌వాటు ప‌డిపోయారు.

పెళ్లి కొడుకు మెడలో యూపీఐ స్కానర్.. కట్నాలు ఇలా కూడా చదివిస్తారా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం ఎవ‌రూ కూడా డ‌బ్బులు జేబులో పెట్టుకోవ‌డంలేదు. ప్ర‌తి ఒక్క‌రూ డిజిట‌ల్ క‌రెన్సీ వాడేందుకే అల‌వాటు ప‌డిపోయారు. ఐదైనా కొనాలి అంటే ఫోన్ తీసి స్కాన్ చేయ‌డమే. దీంతో ఈ మ‌ధ్య యూపీఐ వాడ‌కం భారీగా పెరిగిపోయింది. ఇక్క‌డ అక్క‌డ అని తేడా లేకుండా ప్ర‌తిచోటా యూపీఐని వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ద‌గ్గ‌ర నుండి చిరు దుకాణాల వ‌ర‌కు యూపీఐ పేమెంట్స్ స్వీక‌రిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఆస‌క్తిక‌ర వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఏముందంటే పెళ్లిలో కూడా యూపీఐ పేమెంట్స్ ద్వారా క‌ట్నాలు స్వీక‌రిస్తున్నారు. నిజానికి పెళ్లిళ్ల‌లో యూపీఐ ద్వారా క‌ట్నాలు తీసుకోవ‌డం కామ‌న్ కానీ ఇక్క‌డ ఆ స్కాన‌ర్ ఏకంగా పెళ్లి కొడుకు మెడ‌లోనే వేశారు. అయితే ఇది సీరియ‌స్ గా చేసింది కాదు. అబ్బాయి అమ్మాయి స్టేజ్ పై నిలుచున్న స‌మ‌యంలో వారి ఫ్రెండ్స్ వ‌చ్చి మెడ‌లో యూపీఐ స్కాన‌ర్ వేశారు.

ఆ త‌ర‌వాత స‌ర‌దాగా ఒక్కొక్క‌రూ ఒక్కో రూపాయి పేమెంట్ చేస్తూ వాళ్లు చేసిన పేమెంట్‌ను వీడియోలో చూపిస్తూ నవ్వుకున్నారు. దీనిని అబ్బాయి కూడా నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. ఓ నెటిజన్ ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఫ్రెండ్స్ అంటే ఇలానే ఉంటారు. అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా మరో నెటిజన్ ఖర్చులకు వస్తాయి అంటూ కామెంట్ చేశారు. ఏది ఏమైనా పెళ్లిళ్లలో ఫ్రెండ్స్ చేసే సందడే వేరు కదా. వాళ్లు ఉంటేనే ఫన్..ఫ్రస్టేషన్ మరి.

Next Story