ఆస్పత్రిలో దారుణం.. శవం మీద బంగారం కూడా వదల్లేదు..!

by velandi.Saikiran |

దేశంలో ఏ మూలన చూసిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి... కొంతమంది దౌర్జన్యానికి

ఆస్పత్రిలో దారుణం.. శవం మీద బంగారం కూడా వదల్లేదు..!
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఏ మూలన చూసిన దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి... కొంతమంది దౌర్జన్యానికి దిగుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళ శవాన్ని( Women dead body) కూడా వదలలేదు ఓ దుర్మార్గుడు. ఎవరు అంచనా వేయని రీతిలో... మహిళ శవం మీద ఉన్న బంగారం ( Gold) దొంగిలించాడు. శవం మీద ఉన్న బంగారం.. దొంగిలించి... డబ్బులు దండుకున్నాడు ఆసుపత్రికి సంబంధించిన వార్డ్ బాయ్. ఈ దారుణమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హిరాన్వాడలో తాజాగా జరిగింది.

దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో... క్షణాల్లోనే వైరల్ అయింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్ ( Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన శ్వేత ( Swetha) అనే మహిళ మృతి చెందారు. అయితే ఆ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలోనే అక్కడే ఉన్న వార్డ్ బాయ్ విజయ్ ( Ward Boy Vijay)... ఆ మృత దేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు.

అనంతరం ఎవరూ చూడని సమయంలో ఆమె చెవిపోగులను దొంగిలించాడు వార్డు బాయ్ విజయ్. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో వార్డు బాయ్ విజయ్ ( Ward Boy Vijay) బండారం బయటపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే.. విచారణ మొదలుపెట్టి.. విజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story