స్టాండప్ కమెడియన్‌కు ఊహించని షాక్.. బహిరంగ క్షమాపణ చెప్పించిన TDP సపోర్టర్స్

by Kema Shiva Kumar |

బెంగళూరులో ప్రముఖ స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ ప్రదర్శనను టీడీపీ మద్దతుదారులు అడ్డకున్నారు.

స్టాండప్ కమెడియన్‌కు ఊహించని షాక్.. బహిరంగ క్షమాపణ చెప్పించిన TDP సపోర్టర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్ (Sarath Uday) నిర్వహిస్తున్న కామెడీ షోను తెలుగుదేశం పార్టీ (TDP) మద్దతుదారులు అడ్డుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండున్నర సంవత్సరాల క్రితం ఏపీ సీఎం చంద్రబాబుపై శరత్ వేసిన జోకులు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.

క్షమాపణ చెప్పినా వదలని వైనం..

గతంలో తాను వేసిన జోకులపై శరత్ ఉదయ్ ఇప్పటికే సోషల్ మీడియా (Social Media) వేదికగా క్షమాపణలు కోరారు. అయినప్పటికీ, బెంగళూరులో శనివారం రాత్రి ఆయన ప్రదర్శన ఇస్తున్నారని తెలుసుకున్న కొందరు టీడీపీ మద్దతుదారులు షో జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. కార్యక్రమాన్ని మధ్యలోనే అడ్డుకుని, ప్రేక్షకులందరి సమక్షంలో శరత్‌తో మరోసారి బలవంతంగా క్షమాపణ చెప్పించారు. భవిష్యత్తులో ఇలాంటి జోకులు వేయవద్దని వారు హెచ్చరించారు. అయితే, కోరమంగళలోని సదరు క్లబ్‌లో జరిగిన ఈ మొత్తం ఉదంతం అక్కడ ఉన్న సీసీ టీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యింది. టీడీపీ మద్దతుదారులు కమెడియన్‌తో వాగ్వాదానికి దిగడం, ఆయనను చుట్టుముట్టడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story