Viral Video : మహిళా ప్రయాణికులపై రాడ్‌తో ఉబెర్ డ్రైవర్ దాడి..సాలీ అంటూ బూతుపురాణం

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-26 12:02:09  IST  )

నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. డ్రైవర్ బ్రిజేష్‌ వెళ్తున్న వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని..

Viral Video : మహిళా ప్రయాణికులపై రాడ్‌తో ఉబెర్ డ్రైవర్ దాడి..సాలీ అంటూ బూతుపురాణం
X

దిశ, వెబ్ డెస్క్ : నోయిడాలో మహిళా ప్రయాణికులపై దాడికి పాల్పడ్డాడు ఉబెర్ కారు డ్రైవర్. ఆఫీసుకు వెళ్లేందుకు ఐదుగురు అమ్మాయిలు ఉబెర్ బుక్ చేశారు. బొటానికల్ గార్డెన్ మెట్రో స్టేషన్ నుంచి సెక్టార్ 128లోని ఆఫీసుకు వెళ్తుండగా.. డ్రైవర్ బ్రిజేష్‌ వెళ్తున్న వైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. మరో దారిలో వెళ్లాలని సూచించారు. దీనికి ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిజేష్.. ‘చుప్.. మ్యాప్ ఇలాగే చేపిస్తుంది.. నా దగ్గర పదమూడు కార్లు ఉన్నాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో కారు ఆపాలని.. దిగిపోతామని చెప్పడంతో నిరాకరించిన ఆయన.. ‘సాలీ.. నీలాంటోళ్లు నా దగ్గర పది మంది పని చేస్తరు.. వెయిట్.. నీకు ఇప్పుడే చూపిస్తా.. నిన్ను చంపి జైలుకు వెళ్తా’ అంటూ రాడ్ తీసి ఎటాక్ చేయబోయాడు. వీడియో తీస్తున్న మహిళల నుంచి సెల్ ఫోన్ లాక్కున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు బ్రిజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉబెర్ అతన్ని ప్లాట్ ఫామ్ నుంచి తొలగించింది.

Next Story