పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు.. రెండేళ్లుగా? షాకింగ్ విషయాలు వెల్లడి..!

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-07 04:13:13  IST  )

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్న ఘటన హల్‌చల్ చేస్తోంది.

పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు.. రెండేళ్లుగా? షాకింగ్ విషయాలు వెల్లడి..!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా, ఎవరి మీదనైనా ప్రేమ కలుగవచ్చు. ఇక, యువతీయువకుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఇద్దరు యువతులు గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్న ఘటన హల్‌చల్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యువతులు ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లైన రియా సర్దార్(19), రాఖీ నస్కర్(20కు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం.. కాస్త ప్రేమగా మారింది. ఇక రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వారిద్దరూ వివాహ బంధంతో ఒకటి కావాలనుకున్నారు. ఈ నేపథ్యంలో సుందర్భన్స్‌లోని ఓ ఆలయంలో వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

మేము తొలిసారి గుడిలో కలిశాము. అలా మా ప్రేమ చిగురించి పెళ్లికి దారితీసింది. మేము మా జీవితాంతం కలిసి ఉంటాం, మా ప్రేమ చాలా గొప్పది అని రాఖీ చెప్పింది. ఇక, నేను రాఖీని ఇష్టపడ్డాను. నా మనసు చెప్పిందే చేశాను. నా జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటాను. రెండు కుటుంబాలకు మా పెళ్లి విషయం తెలిపాము. అయినా.. ఇద్దరు వ్యక్తులు జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నప్పుడు జెండర్ అడ్డం కాదు అని రియా పేర్కొంది. ప్రస్తుతం ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story