- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'రీల్స్' గొడవ.. పబ్లిక్‌లో రోడ్డుపై ఘోరంగా కొట్టుకున్న అమ్మాయిలు.. స్పందించిన పోలీసులు
ఈ సోషల్ మీడియా యుగంలో ఈ మధ్య చాలా మంది యువత (Instagram Reel) రీల్స్ మాయాలో పడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (viral video)ఈ సోషల్ మీడియా యుగంలో ఈ మధ్య చాలా మంది యువత (Instagram Reel) రీల్స్ మాయాలో పడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వడం కోసం, వ్యూస్, లైక్‌ల కోసం కొంత మంది చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ చేసేస్తున్నారు. రీల్స్ మోజులో పడి పిచ్చి వేషాలు సైతం వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అమ్మాయిల రీల్స్ పిచ్చి పబ్లిక్‌లో బూతులు తిట్టుకుంటూ తన్నుకునేదాక వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న (Bareilly) బరేలీలోని గాంధీ ఉద్యాన్ (Gandhi Park) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో చూపించిన ప్రకారం.. ఇద్దరు అమ్మాయిలు గొడవ పడుతుండటం చూసి ప్రజలంతా గుమిగూడారు. వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం, జుట్టు లాగడం చేస్తారు. ఘోరంగా ఒకరినొకరు తన్నుకున్నారు. ఈ హై-వోల్టేజ్ డ్రామాను వీక్షించడానికి అమ్మాయిల చుట్టూ ప్రజలు గుమిగూడుతారు.
ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు కారణం రీల్స్ అని తెలుస్తోంది. ఇద్దరూ తమ (Boyfriends0 బాయ్‌ఫ్రెండ్స్‌తో ఓకే లోకేషన్‌లో రీల్స్ చేయాలనుకున్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వాదన పెరిగి ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ సమయంలో అమ్మాయిల బాయ్‌ఫ్రెండ్స్ కూడా సంఘటనా స్థలంలో ఉంటారు. వారు ఇద్దరు అమ్మాయిలను కంట్రోల్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా వారు వినకుండా మళ్లీ రోడ్డుపై ఫైటింగ్ చేస్తారు. ఇక అక్కడ ఉన్నవారు కనుల పండుగగా తమ ఫోన్‌లలో ఈ గోడవను రీల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో వైరల్ అవడంతో గురువారం ఎక్స్ వేదికగా యూపీలోని బరేలీ పోలీసులు స్పందించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.






