- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్ల మధ్య ఫైటింగ్..నిజంగా సినిమా చూపించారుగా
రెండు స్కార్పియో కార్లు ( SUV) సినిమా రేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో భయంకరమైన సంఘటనలకు సంబంధించిన వీడియోలతో పాటు, ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా రెండు స్కార్పియో కార్లు ( SUV) సినిమా రేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నాయి. ఇద్దరు డ్రైవర్లు చాలా కసిగా, కార్లతో ఒకరినొకరు ఢీ కొట్టుకున్నారు. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్ ( Gurugram) ధన్వాపూర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
రెండు కార్ల మధ్య యుద్ధం !
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధన్వాపూర్ ప్రాంతానికి చెందిన ఈ రెండు కార్ల డ్రైవర్ల మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో మనస్పర్తలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో తమ కార్లతో యుద్ధానికి దిగారు. ఒక కారును మరో కారు బలంగా ఢీ కొట్టిన సంఘటన వైరల్ గా మారింది.
ఆ తర్వాత ఓ కారులో నుంచి డ్రైవర్ దిగి, బండలతో మరో కారుపై దాడి చేశాడు. దీంతో ఆ కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఈ సంఘటన వైరల్ గా మారిన తరుణంలో రంగంలోకి పోలీసులు దిగారు. రెండు కార్లను సీజ్ చేసి, డ్రైవర్లపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. ఇలా కూడా తన్నుకుంటారా ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.






