- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అలవాటుతో ఒకే అమ్మాయిని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్ : నెట్టింట వైరల్ అవుతున్న వింత వివాహం
చిన్నప్పటి నుంచి ఆ అలవాటున్న కవల సోదరులు ఒకే అమ్మాయిని పెళ్లాడిన ఘటన యూపీలో వెలుగుచూసింది. దీనిపై నెట్టింట చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లాలోని ఒక గ్రామంలో చోటుచేసుకున్న వింత వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకే అమ్మాయిని కవల సోదరులు వివాహం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కవల సోదరులకు చిన్నప్పటి నుండి ప్రతి పనిని కలిసే చేసే అలవాటు ఉంది. ఆ అలవాటుతోనే వారు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా వరమాల మార్చుకునే సమయంలో ఇద్దరు పెళ్లికొడుకులు స్టేజ్ పైకి రావడంతో అక్కడ ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. పెళ్లికొడుకులు ఇద్దరూ సంతోషంగానే ఉన్నప్పటికీ, పెళ్లికూతురు మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ వింత వివాహానికి పెళ్లికూతురు ఎలా అంగీకరించింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే గ్రామంలో మాత్రం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వార్తలు వేగంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధిస్తూ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఇది పాత ఆచారమని, కొన్ని మారమూల పల్లెటూళ్లలో వీటిని ఇంకా పాటిస్తున్నారన్న వాదన కూడా ఉంది. నాగరికత ఎంత పెరిగినా కొన్ని ప్రాంతాలలో, కుటుంబాలలో గత కాలంనాటి సాంప్రదాయాలు, ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని తెగలలో అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకునే సాంప్రదాయం ఉందట. ఉమ్మడి కుటుంబం నిలబడాలని, ఆస్తులు పంపకం జరగకూడదని, ఇలాంటి కారణాలతో ఇలా చేసుకుంటారని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ పెళ్లి కూడా అలాంటి పెళ్లేనంటున్నారు.






