Usha Vance: మన తెలుగు సాంప్రదాయం నిలబెట్టావమ్మా! ఎందుకో తెలుసా? వైరల్ ట్వీట్

by Ramesh Naini |   (  Updated:2025-04-28 11:34:23  IST  )

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (US VP JD Vance) కుటుంబం తాజ్‌ మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.

Usha Vance: మన తెలుగు సాంప్రదాయం నిలబెట్టావమ్మా! ఎందుకో తెలుసా? వైరల్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (US VP JD Vance) కుటుంబం తాజ్‌ మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. తన భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం తాజ్‌ మహల్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌ తాజ్‌ మహల్‌ వద్ద సందడి చేశారు. దాదాపు ఓ గంటపాటు ఆ అద్భుత నిర్మాణాన్ని వీక్షించి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఒకే బట్టతో పిల్లలందరికీ చొక్కాలు కుట్టించడం మన తెలుగు సాంప్రదాయం, ఖండాలు దాటి వెళ్లినా మన సాంప్రదాయాన్ని నిలబెట్టావమ్మా’ అంటూ వెంగళం అనే నెటిజన్ ఎక్స్ వేదికగా ఫోటోను షేర్ చేశారు. ఈ నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఊరుకుంది లేకుంటే ఆయనకు కూడా అదే తానులో గుడ్డనే ఉపయోగించేవారు.. అని మరో నెటిజన్ ఈ పోస్టుకు ఫన్నీ కామెంట్ పెట్టారు. అయితే ప్రస్తుతం అదే ఫ్యాషన్ నడుస్తోందని అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. కాగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉషా చిలుకూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన తెలుగువారు కావడం గమనార్హం.

ఇటీవల ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఉషా వాన్స్ తెలుగువారని కొనియాడారు. ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆడబిడ్డ కావడం గర్వకారణమన్నారు. ఆమె సాధించిన విజయాలు ప్రతి తెలుగు గుండెను గర్వంతో నింపుతాయని, తెలుగువారి గొప్పతనాన్ని, ముఖ్యంగా మన ఆడపిల్లల ప్రతిభ ఏంటో ఆమె ఈ ప్రపంచానికి చూపిస్తున్నారని అన్నారు. ఆమె తన మూలాలను గౌరవిస్తూ, ఆ విలువలను తన పిల్లలకు అందిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఆమె మన సంస్కృతిని కాపాడుతూ, భావితరాలకు అందిస్తున్నారని, ఇది మనందరికీ గర్వకారణమన్నారు. ఉసా వాన్స్ ఎన్నో విజయాలు సాధించి మన తెలుగు రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story