"నేను ఒంటరిని కాదు.. సముద్రాన్ని".. వైరల్ అవుతున్న విజయ్ ఇన్స్టా వీడియో

by Muthe.Rajitha |   (  Updated:2025-08-22 10:38:36  IST  )

తమిళ స్టార్ నటుడు విజయ్(Vijay) తన తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ సభకు అశేష అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చిన విషయం తెలిసిందే.

నేను ఒంటరిని కాదు.. సముద్రాన్ని.. వైరల్ అవుతున్న విజయ్ ఇన్స్టా వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ నటుడు విజయ్(Vijay) తన తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ సభకు అశేష అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ స్థాపించిన తర్వాత నిన్నటిది రెండవ సభ. రెండో మీటింగ్ కే 4 లక్షలకు పైగా జనం తరలిరావడం గమనార్హం. కాగా సభ మధ్యలో విజయ్ అభిమానులతో సెల్ఫీ తీసుకోగా.. దానిని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసారు. 'నేను ఒంటరిని కాదు.. సముద్రాన్ని' అని కింద క్యాప్షన్ రాసుకొచ్చారు విజయ్.

కాగా వీడియోలో ఎటు చూసినా భారీగా జనం కనిపిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో TVK ఎన్నికల సన్నాహకాల్లో ఇప్పటి నుంచే దిగినట్టు కనిపిస్తోంది.

Next Story