- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bride: పెళ్లి కూతురు పెద్ద మనసు.. గాజాకు మద్దతుగా కట్నం విరాళం.. నెట్టింట ప్రశంసల వెల్లువ
ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా పాలస్తీనా పౌరులు మారిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్ (Israel) దాడులతో (Gaza) గాజాలో సర్వం కోల్పోయి శరణార్థులుగా (palestine) పాలస్తీనా పౌరులు మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే గాజా పూర్తిగా విధ్వంసానికి గురవడంతో అక్కడి పౌరులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ పెళ్లి కూతురు పెద్ద మనసు చాటుకోని నెటిజన్ల మనసు దోచుకుంది. టర్కిష్ (Turkish bride) ప్రావిన్స్ బాట్‌మ్యాన్‌కు చెందిన ఒక వధువు తనకు వివాహ రిసెప్షన్‌లో వచ్చిన మొత్తం కట్నాన్ని (బంగారం) పాలస్తీనా ప్రజలకు సహాయం చేయడానికి విరాళంగా ఇచ్చింది. దాని మొత్తం విలువ దాదాపు $40,000 - అంటే దాదాపు భారత కరెన్సీలో రూ. 33 లక్షలకు పైగా డొనేట్ చేసింది. ఇందుకు కుటుంబ సభ్యులు సైతం ఆమెను ప్రోత్సహించారు.
ఇంత సాయం చేసి కూడా వధువు తన పేరు వెల్లడించలేదు. గాజాలో అణచివేతకు గురైన పాలస్తీనియన్ల బాధలను తగ్గించే లక్ష్యంతో ఒక గొప్ప కార్యక్రమానికి నా నుంచే మొదలు కావాలని కోరుకుంటున్నట్లు వధువు తెలిపింది. ఇజ్రాయెల్ దురాక్రమణ కారణంగా పాలస్తీనా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో, తన సహాయం వల్ల ఇతరులు కూడా వారికి మద్దతు తెలుపడానికి ప్రేరణనిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.. కానీ వధువు తనకు వచ్చిన బంగారాన్ని మొత్తం కూడా డొనేట్ చేయడం పెద్ద విషయం అని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు తెలియజేస్తున్నారు. కాగా, ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య గత కొన్ని ఏళ్లుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్ టూరిస్టులపై దాడులకు పాల్పడటంతో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది.






