- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: న్యూస్ పేపర్లతో చీర కట్టిన యువతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
కాదేది కలకు అనర్హం’ అన్నట్లుగా.. ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వింత పని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురపిస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘కాదేది కలకు అనర్హం’ అన్నట్లుగా.. ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వింత పని చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. ‘అహ నా పెళ్లంట’ మూవీలో హీరో రాజేంద్ర ప్రసాద్ డబ్బు ఆదా చేసేందుకు ఓ న్యూస్ పేపర్‌ను లుంగీలా కట్టుకుని పిసినారితనాన్ని చూపిస్తాడు. అయితే, అచ్చం అలాంటి సీనే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈసారి డబ్బు ఆదా చేసేందుకు కాదు కానీ.. సరదాగా పార్వతి అనే ఇన్ఫ్లుయెన్సర్ వినూత్న ఆలోచనకు తెర లేపింది. న్యూ్స్ పేపర్లతో ఏకంగా చీరను తయారు చేసి కట్టుకుంది. వివిధ కళాకృతుల రూపకల్పనకు పేరొందిన పార్వతి న్యూస్ పేపర్లతో చీర కట్టిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోకు ఏకంగా 2.6 మిలియన్ వ్యూస్‌తో పాటు 65 వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.
Next Story






