Trending: వారెవ్వా వింత ఆచారం.. బండరాయిపై పాశం నాకుతూ మొక్కులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-21 03:31:25  IST  )

సాగు చేసిన పంటలకు సకాలంలో వర్షాలు పడక, తాగేందుకు నీళ్లు లేక జనం అరిగోసలు పడిన సందర్భాలు కోకొల్లలు.

Trending: వారెవ్వా వింత ఆచారం.. బండరాయిపై పాశం నాకుతూ మొక్కులు
X

దిశ, వెబ్‌డెస్క్: సాగు చేసిన పంటలకు సకాలంలో వర్షాలు పడక, తాగేందుకు నీళ్లు లేక జనం అరిగోసలు పడిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో మన పూర్వీకులు వర్షాలు కురవాలని ఆ వరుణ దేవుడిని ప్రార్థిస్తూ.. రకరకాల ఆచారాలను పాటిస్తుండేవారు. ఇందులో భాగంగానే కప్పతల్లి ఆటలు ఆడిస్తుండేవారు. కప్పలను ఒక కాడికి కట్టి, గ్రామస్తులు వాటిని వీధుల్లో ఊరేగించేవారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోని వారు ఆ కప్పలకు నీళ్లు పోసి అభిషేకం చేస్తుడటం మనం చూసే ఉంటాం.

కానీ, జనగామ (Jangaon) జిల్లాలో మాత్రం వానలు కురిసేందుకు ఏళ్లుగా ఓ వింత ఆచారన్ని పాటిస్తున్నారండోయ్. వివరాల్లోకి వెళితే.. స్టేషన్ ఘనపూర్ (Station Ghanapur) మండల పరిధిలోని రాఘవ‌పూర్ (Raghavapur) గ్రామంలో వర్షాలు సంమృద్ధిగా కురవాలని పోతరాజు గండి వద్ద గ్రామస్తులు పోయ్యి రాళ్లు పెట్టి పాశం వండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాతిబండపై పెళ్లి కాని యువకులకు వరద పాశం వేసి వారితో నాకించారు. అయితే, ఆ పాశం తింటే రెండు రోజుల్లోనే వరుణ దేవుడు కురుణించి వర్షాలు కురిపిస్తాడని ఆ గ్రామస్థుల నమ్మకమట.

Next Story