Trending: నా చావుకు ఆ ఇద్దరే కారణం.. జర్నలిస్ట్ సెల్ఫీ వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-30 07:59:03  IST  )

ఓ ప్రముఖ పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Trending: నా చావుకు ఆ ఇద్దరే కారణం.. జర్నలిస్ట్ సెల్ఫీ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ ప్రముఖ పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాస్సువాడకు చెందిన ఓ రిపోర్టర్ గత 17 ఏళ్లుగా ఓ ప్రముఖ పత్రికలో రిపోర్టర్‌గా విధుల నిర్వర్తిస్తున్నాడు. అయితే, తనను ఉమ్మడి జిల్లాకు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు వేధిస్తున్నారంటూ సదరు రిపోర్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ.. సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియాలో బాస్సువాడ రిపోర్టర్ మాట్లాడుతూ.. అడిగిన డబ్బులు ఇవ్వనందుకే తనను ఉద్యోగం నుంచి తీసేశారని పేర్కొన్నాడు. ఇందులో సంస్థ తప్పు ఏమాత్రం లేదన్నారు.

సదరు పత్రికలో డబ్బులిస్తే చాలు.. ఏదైనా సాధ్యమేనని చెప్పుకొచ్చాడు. ప్రతి రిపోర్టర్‌కు టార్గెట్ ఇస్తున్నారని.. వసూళ్లు చేయించుకుంటున్నారని వెల్లడించారు. ఎల్లారెడ్డిలో ఇలానే చేస్తే.. చాలా మంది రిపోర్టర్లు సదరు పత్రిక నుంచి బయటకు వెళ్లారని తెలిపాడు. ఎల్లారెడ్డికి చెందిన రిపోర్టర్లను వేధించడం వల్ల వారు బయటకు వెళ్లిపోయి. ఆ జర్నలిస్టులకు సంబంధించిన వాయిస్ రికార్డులను కూడా ఆధారాలతో బయటపెట్టారని.. అయినా ఆ ఇద్దరికీ బుద్ధి రావడం లేదని అన్నాడు. తన చావుకు ఆ ఇద్దరు జర్నలిస్టులే కారణమని సదరు రిపోర్టర్ సెల్ఫీ వీడియోలో చెప్పడం సంచలనంగా మారింది.

Next Story