- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: రైల్వే ట్రాక్‌పై థార్ ఎస్‌యూవీతో స్టంట్లు.. కట్ చేస్తే నేరుగా జైలుకు
ఈ రోజుల్లో యువత పిచ్చి పీక్స్‌కు చేరింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ (Reels) కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో యువత పిచ్చి పీక్స్‌కు చేరింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో రీల్స్ (Reels) కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు. లైక్స్ కోసం, సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ అవ్వాలని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కన్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. తాజాగా, రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం జైపూర్ (Jaipur)కు చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టా (Insta)లో రీల్స్ కోసం తన మహీంద్ర థార్ (Mahindra Thaar) ఎస్‌యూవీతో ఏకంగా రైల్వే ట్రాక్‌పై స్టంట్స్ చేశాడు. తాగిన మైకంలో అతివేగంతో కారు నడుపుతూ.. కాసేపు బీభత్సం సృష్టించాడు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న రైల్వే పోలీసులు (Railway Police) సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్‌పై స్టంట్స్ చేసిన వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది.






