Trending: బ్యాట్ పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.. నెట్టింట్లో ఫొటోలు వైరల్

by Kema Shiva Kumar |

నిత్యం విపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఉత్సాహంగా బ్యాట్ చేతబట్టాడండోయ్.

Trending: బ్యాట్ పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్.. నెట్టింట్లో ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యం విపక్షాలపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ఉత్సాహంగా బ్యాట్ చేతబట్టాడండోయ్. ఇవాళ ఎల్బీ స్టేడియం (LB Stadium)లో యూత్ కాంగ్రెస్ (Youth Congress) ఆధ్వర్యంలో ‘క్రికెట్ ఖేలో.. నషా చోడో’ (Cricket Khelo.. Nasha Chodo) ట్యాగ్‌లైన్‌తో నిర్వహిస్తున్న తెలంగాణ టీ20 ఛాంపియన్‌షిప్ (Telangana T20 Championship) క్రికెట్ టోర్నమెంట్‌ను ఆయన అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడికి యువ ప్లేయర్లతో ముచ్చటించి.. వారిలో నూతనోత్తేజాన్ని నింపారు. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) బ్యాటింగ్ చేయగా.. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి (Rohin Reddy) ఆయనకు బౌలింగ్ చేశారు. అనంతరం టాస్ వేసి తెలంగాణ టీ20 ఛాంపియన్‌ షిప్‌ టోర్నమెంట్‌ను మంత్రి ప్రారంభించారు. అయితే, ప్రస్తుతం మంత్రి పొన్నం బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియా (Social Media)లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story