Trending: రింకూ చెంప చెల్లుమనిపించిన కుల్దీప్.. నెట్టింట్లో వీడియో వైరల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-30 05:57:45  IST  )

ఐపీఎల్-2025 (IPL-2025)లో భాగంగా మంగళవారం ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), ఢిల్లీ క్యాపిటల్స్‌ (Dehli Capitals) మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగింది.

Trending: రింకూ చెంప చెల్లుమనిపించిన కుల్దీప్.. నెట్టింట్లో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2025 (IPL-2025)లో భాగంగా మంగళవారం ఢిల్లీ (Delhi)లోని అరుణ్ జైట్లీ (Arun Jaitley) వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), ఢిల్లీ క్యాపిటల్స్‌ (Dehli Capitals) మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ఇది ఇలా ఉంచితే.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షెక్ హ్యాండ్స్ చేసుకుంటుండగా.. ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్‌ (Kuldeep Yadav), కోల్‌కతా బ్యాటర్‌ రింకూ సింగ్‌ (Rinku Singh)ను గట్టిగా ఓ చెంప దెబ్బ కొట్టారు. మొదటిసారి సీరియస్‌గా తీసుకోని రింకు అసలు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి కుల్దీప్ చంపదెబ్బ కొట్టగా.. రింకూ చాలా సీరియస్ అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో లైవ్ స్ట్రీమింగ్‌లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ ఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎంత సీనియర్ అయితే మాత్రం అలా రింకూపై చేయిచేసుకోవడం ఏంటని కుల్దీప్‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు.

శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన భజ్జి

ఐపీఎల్-2008 (IPL-2008) ఏప్రిల్ 25న ముంబై ఇండియన్స్ (Mumbai Indians), కింగ్స్-XI పంజాబ్ (Kings IX Punjab) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ అనంతరం ఇరు జట్ల సభ్యులు షేక్‌హ్యాండ్స్ తీసుకుంటుండగా.. హర్భజన్ (Harbhajan Singh), శ్రీశాంత్ (Sreesanth) చెంప చెల్లుమనిపించాడు. అప్పట్లో ఆ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ భజ్జిపై మిగిలిన ఆ ఐపీఎల్ సీజన్‌‌లో ఆడకుండా నిషేధం విధించింది. అనంతరం హర్భజన్, శ్రీశాంత్‌క క్షమాపణ చేప్పాడు.

Click For Tweet..

Next Story