- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: ఖైరిగూడనా.. మజాకా! గ్రామంలో డీజే, హల్దీ ఫంక్షన్లు బంద్
ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ గ్రామస్తులె సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారు. పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, మద్యపానంపై పూర్తి నిషేధం విధిస్తూ గ్రామసభలో తీర్మానించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆధునిక పోకడల పేరుతో పెళ్లిళ్లలో జరుగుతున్న అనవసర ఖర్చులు, యువత మత్తుకు బానిస అవుతున్న తీరుపై కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఖైరిగూడ (Khairiguda) గ్రామస్తులు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని పెద్దలు, యువకులు అంతా ఏకమై ‘గ్రామ కట్టబాట్ల’ను అమలు చేయాలని తీర్మానించారు. గ్రామ పరిధిలో శుభకార్యాలు, పెళ్లిళ్లలో డీజే సౌండ్ సిస్టమ్స్ (DJ Sound Systems) వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం సాంప్రదాయ వాయిద్యాలతోనే వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ట్రెండ్‌గా మారిన ప్రీ వెడ్డింగ్ షూట్లు (Pre-wedding shoots), ఆడంబరంగా చేసే హల్దీ ఫంక్షన్ల (Haldi Functions)ను గ్రామంలో అనుమతించబోమని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో మద్యపానం, గుడుంబా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. గ్రామ సభలో తీసుకున్న ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే రూ.50,000 జరిమానా విధిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
ఎందుకు ఈ నిర్ణయం..?
పెళ్లిళ్ల పేరుతో అప్పులు చేసి ఆడంబరాలకు పోవడం వల్ల అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నాయని, అలాగే డీజేల వల్ల శబ్ద కాలుష్యం, గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. మత్తు పదార్థాల వల్ల గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.






