- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trending: నేను తోపుడు బండిని..! మంత్రి సీతక్క ఇలాకాలో వెలిసిన వెరైటీ ఫ్లెక్సీ
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేకాధికారుల కొనసాగుతోంది. తలకుమించిన పనులు, ఉన్నతాధికారుల సమీక్షలతో ఎవరి పర్యవేక్షణ లేక పల్లెల్లో అభివృద్ధి నిలిచిపోయింది. ఇక పారిశుధ్యం అంటారా.. మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారంతో గ్రామ పంచాయతీలు కళావిహీనంగా మారుతున్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహించపోవకడంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులకు బ్రేక్ పడింది.
ఈ క్రమంలోనే సాక్షాత్తూ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఇలాకా అయిన ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం (Venkatapuram) మండల కేంద్రంలో ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు’ అంటూ ఓ వెరైటీ ఫ్లెక్సీ వెలిసింది. ఆ ఫ్లెక్సీలో ‘మన గ్రామంలో మంచి మనసున్న దాతలు ముందుకు వస్తే.. గ్రామ పంచాయతీయితీకి వెళ్లి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాసి ఉంది. కింద సంపద్రించువారు గ్రామ పంచాయతీ కార్యాలయం, వెంకటాపూర్ అని తెలిపారు. అయితే, గత ప్రభుత్వం వెంకటాపురం పంచాయతీకి గ్రామంలోని చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ కేటాయించారట. కానీ, చెత్తను సేకరించేందుకు అవసరమైన తోపుడు బండ్లు అందుబాటులో లేకపోవడంతో కొన్నాళ్ల నుంచి పరిస్థితి అధ్వానంగా మారిందట. తమకు తోపుడు బండ్లు కావాలని పలుమార్లు ఉన్నతాధికారులకు పంచాయతీ కార్యదర్శిగా ఉన్న చందూలాల్ ప్రతిపాదనలు పంపినా లాభం లేకుండా పోయింది. దీంతో ఆయన ‘నేను తోపుడు బండిని.. నా ధర రూ.8వేలు’ అంటూ దాతలైనా ఇచ్చేందుకు ముందుకు రావాలని గ్రామం నడిబొడ్డున వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది చూసిన గ్రామస్థులు ఇదేం విడ్డూరమని ముక్కున వేలేసుకుంటున్నారు.






