Trending: కంటతడి పెట్టిన హరీశ్ రావు.. అసలు విషయం ఇదే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-19 14:35:30  IST  )

రాజకీయాల్లో ఆరితేరిన ఆజానుబాహుడు ఆయన. పార్టీకి కష్టం వస్తే.. ట్రబుల్ షూటర్‌గా ముందుండి నడిచే తెగువ ఆయనది.

Trending: కంటతడి పెట్టిన హరీశ్ రావు.. అసలు విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయాల్లో ఆరితేరిన ఆజానుబాహుడు ఆయన. పార్టీకి కష్టం వస్తే.. ట్రబుల్ షూటర్‌గా ముందుండి నడిచే తెగువ ఆయనది. ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీలో తన వాక్చాతుర్యంతో ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువు నీళ్లు తాగించే హరీశ్ రావు (Harish Rao) చిన్నపిల్లోడిలా కంటతడి పెట్టారు. అవును మీరు విన్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. ఇవాళ సిద్దిపేట (Siddipet)లో ‘విద్యార్థులు భద్రంగా ఉండాలి- భవిష్యత్తులో ఎదగాలి’ అనే అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఓ విద్యార్థిని హరీశ్ రావుతో మాట్లాడుతూ.. తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తనకు నాన్న ప్రేమ ఏంటో తెలియదంటూ బోరున విలపించింది. ఆ మాటలు విన్న హరీశ్ రావు విద్యార్థినిని అక్కున చేర్చుకుని చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం సదరు విద్యార్థినిని వేదికపై తన పక్కనే కూర్చోబెట్టుకుని ఓదార్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఆ ఉద్విగ్న క్షణాలు చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

Next Story