Trending: విమానంలో ప్రయాణికులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ధోని.. అసలు ఏం జరిగిందంటే? (వీడియో వైరల్)

by Shiva |
Trending: విమానంలో ప్రయాణికులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ధోని.. అసలు ఏం జరిగిందంటే? (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సెలబ్రిటీలు ఒక ప్రాతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ప్రైవెట్ జెట్లు లేకపోతే సొంత విమానాలను వాడుతారు. లేకపోతే బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తుంటారు. కానీ, టీమిండియా మాజీ కెప్టెన్ ధోని స్టైలే వేరు. నిరాడంబరంగా ఉంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా, ధోని బెంగళూరు నుంచి తన హోం సిటీ అయిన రాంచీకి విమానం వెళ్లాడు. అందులో విశేషం ఏముందని అనుకునేరు. అయితే, అతడు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించి అందరికీ షాకిచ్చాడు. దీంతో తోటి ప్రయాణికులు ధోని విమానంలోకి ఎక్కగానే చప్పట్లు, కేరింతలతో స్వాగతం పలికారు. ఈ పరిణామంతో అందరూ ధోని ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఏంటని చర్చించుకున్నారు. ఆయన ఉన్న స్థాయి ఏంటి.. ఆ సింప్లిసిటీని చూసి అందరూ ఫిదా అయిపోయారు.

Click Here For Twitter Post..

Next Story

Most Viewed