- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TRENDING: భక్తికి తోడైన విశ్వాసం.. శునకం చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
కేవలం 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ వేసినందుకు.. 130 కిలో మీటర్ల మేర భక్తులకు తోడుగా నడిచిన ఓ శునకం సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘కుక్కకు ఉన్నంత విశ్వాసం మనిషికి ఉండదు’ అని పెద్దలు ఊరికే అనలేదండోయ్. అయితే, ఆ మాటను అక్షరాలా నిజం చేస్తూ, ఓ మూగజీవి చూపిన అనురాగం ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో అందరినీ కంటతడి పెట్టిస్తంది. ఐదంటే.. ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌తో ఆకలి తీర్చారని.. ఆ భక్తుల వెంటే అడవులు, కొండలు దాటుతూ ఏకంగా 130 కి.మీ నడిచింది ఓ శునకం.
ఆకలి తీర్చినందుకు విశ్వాసం..
వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూరు (Gudihathnur)కు చెందిన కొందరు భక్తులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. మండల దీక్ష పూర్తికావడంతో, మొక్కు తీర్చుకోవడానికి కాలినడకన కొండగట్టు (Kondagattu) ఆలయానికి పాదయాత్రన బయలుదేరారు. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే వారికి దారిలో ఓ శునకం ఎదురైంది. ఆకలితో ఉన్న ఆ మూగజీవికి భక్తులు ఓ రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌ను వేశారు. అంతే.. ఆ చిన్న సాయం ఆ కుక్క మనసును గెలుచుకుంది. ఇక అక్కడి నుంచి ఆ భక్తులు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వారు ఎక్కడ ఆగితే అక్కడ.. ఆ శునకం కూడా వారి వెంటే ఉంది. ఎండనక, వాననక ఐదు రోజుల పాటు గుడిహత్నూరు నుంచి కొండగట్టు వరకు సుమారు 130 కి.మీ మేర ఆ భక్తులతో కలిసి నడిచింది. మార్గమధ్యంలో ఎన్ని కుక్కలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా తన తోడును మాత్రం వదల్లేదు.
కుక్క కాళ్లకు సాక్సులు.. భక్తుల సపర్యలు
వంద కిలో మీటర్ల నడక వల్ల ఆ కుక్క కాళ్లు వాచిపోయి, నడవలేని స్థితికి చేరుకుంది. అది గమనించిన భక్తుల మనసు కరిగింది. ఆ మూగజీవి పడుతున్న శ్రమను చూసి చలించిపోయిన వారు, దానికి సాక్సులు (Socks) తొడిగి, కాళ్లకు మందులు రాసి సపర్యలు చేశారు. తమతో పాటే దానికి కూడా ఆహారం పెడుతూ, ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారు. ప్రస్తుతం ఆ శునకానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.






