Trending: కూతురు పుట్టిన రోజు.. ఆటో‌డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? (వీడియో వైరల్)

by Disha Web Desk 1 |
Trending: కూతురు పుట్టిన రోజు.. ఆటో‌డ్రైవర్ ఏం చేశాడో తెలుసా? (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా కొడుకులు ఉన్న వాళ్లకు కూతుళ్ల విలువ తెలియదంటారు. కానీ, ఇంట్లో ఆడపిల్ల ఉంటే.. ఆ సందడి వేరు. ముఖ్యంగా నాన్నతో ఆ బాండింగ్ వేరే లెవల్ అంతే. తాజాగా, బెంగళూరు ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు హ్యాట్స్‌ఫ్ అంటున్నారు. అయితే, బెంగళూరు సిటీకి చెందిన ఓ మహిళ ఇవాళ ఓ ఆటో ఎక్కింది. అయితే ఆ ఆటోలో డ్రైవర్ సీట్ వెనకాలే ఓ పింక్ బెలూన్ వేళాదీసి ఉండటాన్ని ఆమె గమనించింది. ఏంటీ.. ఆటోలో పింక్ బెలూన్ పెట్టారని డ్రైవర్‌ను ప్రశ్నించగా.. అతడు ‘ఇవాళ నా ముద్దుల కూతురు బర్త్ డే’ ఆ విషయాన్ని ఎక్కడ మరిచిపోతానో అని గుర్తుగా ఆటోలో బెలూన్ తగిలించాను’ అంటూ సమాధానమిచ్చాడు. ఈ క్రమంలోని నెటిజన్ సుమేధా ఉప్పల్ ఆటోలో బెలూన్‌కు సంబంధించిన 6 సెకన్ల వీడియోను ‘ఇది అతడి కుమార్తె పుట్టిన రోజు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా.. 1.31లక్షల మంది యూజర్లు వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఇలాంటి వీడియో షేర్ చేసినందకు థ్యాంక్స్ అంటూ రిప్లే ఇస్తున్నారు.

Next Story

Most Viewed