Trending: CM, PM ఫొటోలకు ఘోర అమమానం.. బాత్‌రూం పక్కన పడేసిన వైనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-19 09:20:11  IST  )

దేశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minster Narendra Modi)తో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) ఫొటో ఉండటం ప్రోటోకాల్.

Trending: CM, PM ఫొటోలకు ఘోర అమమానం.. బాత్‌రూం పక్కన పడేసిన వైనం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minster Narendra Modi)తో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Chief Minister) ఫొటో ఉండటం ప్రోటోకాల్. అయితే, ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. కార్యాయాల్లో వారి ఫొటోలు పెట్టకపోయినా పరవాలేదు.. కానీ, వాటిని గోడలకు తగిలించకుండా అడ్డదిడ్డంగా పడేయడమే అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది. అచ్చం అలాంటి ఘటనే కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చిత్రపటాన్ని గోడకు తగిలించాల్సింది పోయి ఏకంగా బాత్‌రూం దగ్గర దిక్కు దివానా లేకుండా పడేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని ఫొటో ఫ్రేమ్‌ను ఏకంగా టేబుల్ కింద మడతెట్టేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘోరం చూసిన కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నాయకులు అధికారులకు కనీసం జ్ఞానం ఉండక్కర్లేదా అని మండిపడుతున్నారు. దేశంలో అత్యంత ఉన్నత పదవుల్లో కొనసాగుతోన్న వారి చిత్రపటాలను అలా నిర్లక్ష్యంగా పడిసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story