Trending: వాట్ ఏ మిరాకిల్.. పోయిన ప్రాణం తిరిగొచ్చేసింది!

by Shiva |
Trending: వాట్ ఏ మిరాకిల్.. పోయిన ప్రాణం తిరిగొచ్చేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే తల్లి గర్భంలోంచి వచ్చిన ముక్కుపచ్చలారని పసిపాప. ఏం జరిగిందో తెలియదు ఊపిరాడక అల్లాడిపోయింది. ఓ వ్యక్తికి సమయస్ఫూర్తితో వచ్చిన ఆలోచన మళ్లీ ఆ శిశువుకు ప్రాణం పోసేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. తాజాగా మెదక్ ప్రభుత్వాసుపత్రి (Medak Government Hospital)లో ఓ మహిళ అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా పాపకు ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. గమనించిన వైద్యులు శివువును మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ (Hyderabad)లోని నీలోఫర్ ఆసుపత్రి (Nilofer Hospital)కి తీసుకెళ్లాలని సూచించారు.

అయితే, నగరానికి బయలుదేరగా.. మార్గమధ్యలో పాప గుండె ఒక్కసారిగా ఆగిపోవడంతో తల్లిదండ్రులు విలవిలలాడిపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న 108 అంబులెన్స్ టెక్నీషియన్ (Ambulance Technician) రాజు ఆ ముక్కుపచ్చలారని శిశువుకు సీపీఆర్ (CPR) చేసి మళ్లీ ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఆ శిశువును నీలోఫర్ ఆసుపత్రి (Nilofer Hospital)లో చేర్పించడంతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి పాపకు సీపీఆర్ (CPR) చేసిన టెక్నీషియన్ రాజును వైద్యులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed