పీక‌ల‌దాకా తాగి.. వాహనం నడిపిన ట్రాఫిక్ కానిస్టేబుల్

by velandi.Saikiran |

కమలాకర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్... ఓలా బైక్ పై వెళ్తున్నాడు. అయితే అతడు... తూలుతూ బైక్ నడపడానికి గమనించిన...

పీక‌ల‌దాకా తాగి.. వాహనం నడిపిన ట్రాఫిక్ కానిస్టేబుల్
X

దిశ‌, వెబ్ డెస్క్ : జనాలకు నీతులు చెప్పాల్సిన పోలీసులే... తప్ప తాగి వాహనాలు నడుపుతున్నారు. ఇక వాళ్లే అలా వ్య‌వ‌హ‌రిస్తే.. సామాన్యులు ఊరుకుంటారా..? అయితే.. అచ్చం అలాంటి సంఘ‌ట‌నే తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. హెల్మెట్ లేకుండానే... మద్యం తాగి... వాహనం నడిపాడు ఓ ట్రాఫిక్ పోలీస్. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో జరిగింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గురువారం అర్ధరాత్రి.. హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన కమలాకర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్... ఓలా బైక్ పై వెళ్తున్నాడు. అయితే అతడు... తూలుతూ బైక్ నడపడానికి గమనించిన... ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానికి తోడు నెంబర్ ప్లేట్ కూడా లేని బైక్ అతను నడపడం గమనార్హం. దీంతో సార్ మీరు తాగి, బైక్ ఎందుకు నడుపుతున్నారని నిలదీశాడు ఆ వ్యక్తి. అవును నేను తాగాను... అంటూ ఎలాంటి భయం లేకుండా ప్రవర్తించాడు సదరు కానిస్టేబుల్.

వాళ్లు వీడియో తీసినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా... తోటి వాహనదారులను వెక్కిరించాడు. ఈ వీడియోని తీసిన నగరవాసులు సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక ఆ వీడియో రాత్రి రాత్రికే వైర‌ల్ గా మారింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కమలాకర్... మెట్టు సాయికుమార్ త‌మ్ముడ‌ని స‌మాచారం. అతని మతిస్థిమితం సరిగ్గా లేనందున తాగినట్లు కనిపిస్తాడని.. చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు కమలాకర్‌పై చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు పోలీసులు. క్లిక్

Next Story