ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పర్యాటకులు.. భద్రా అటవీ పరిధిలో ఘటన వైరల్

by Ramesh Naini |

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె తాలూకా లక్కవల్లి సమీపంలో జరిగిన ఘటన పర్యాటకులను కుదిపేసింది.

ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్న పర్యాటకులు.. భద్రా అటవీ పరిధిలో ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా తరికెరె తాలూకా లక్కవల్లి సమీపంలో జరిగిన ఘటన పర్యాటకులను కుదిపేసింది. భద్రా నది కుడి ఒడ్డుకాలువ వద్ద జంగిల్ లాడ్జెస్ & రిసార్ట్స్‌కు చెందిన జీపులో సఫారీకి వెళ్లిన పర్యాటకులు అడవి ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. భద్ర రంగనాథ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా ఓ అడవి ఏనుగు జీపు వైపు దూసుకొచ్చింది. పరిస్థితి విషమమవుతుందనగానే జీపు డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే వాహనాన్ని వెనక్కి తిప్పాడు. డ్రైవర్ సమయోచితంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ఈ సంఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేయగా, ఆ వీడియోను @karnatakaportfolio సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటన శుక్రవారం జరిగనట్లు సమాచారం. అడవిలో వన్యప్రాణుల సహజ ప్రవర్తన ఎంత ఊహించని విధంగా మారుతుందో, అలాగే పర్యాటకుల నిర్లక్ష్యం లేదా అధిక జనసంచారం వన్యప్రాణులకు ఎలా అభద్రతను కలిగిస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని నెటిజన్‌లు భావిస్తున్నారు. అటవీ ప్రదేశాలలో పర్యాటకులు భద్రతా నియమాలను కచ్చితంగా అనుసరించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ వీడియో ఇదే..

Next Story