- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐతో ఉద్యోగాల తొలగింపు నిజమే.. రెడిట్ పోస్ట్ వైరల్.. కానీ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలకు ముప్పు ఉందన్న భయం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలకు ముప్పు ఉందన్న భయం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే ఏఐ టూల్స్ వాడాలని ఎంప్లాయిస్ పై ఒత్తిడి చేస్తూ.. సూచనలు పాటించని వారిని ఉద్యోగం నుంచి తొలగించేందుకు కూడా సిద్ధమయ్యాయి. అలా ఓ యూజర్ రెడిట్ లో చేసిన పోస్ట్ కొత్త చర్చకు దారి తీసింది. కంపెనీలు ఖర్చు తగ్గించుకుని, లాభాల కోసం ఏఐ టూల్స్ ను వాడుతున్నాయని, ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు పర్వం కూడా మొదలైందని ఆ యూజర్ పేర్కొనడం నెట్టింట ప్రకంపనలు సృష్టించింది. ఇండియన్ వర్క్ ప్లేస్ అనే రెడిట్ గ్రూపులో ఏఐ రీప్లేస్ మెంట్ ఈజ్ రియల్ అనే పేరుతో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది.
తాను పనిచేస్తున్న కంపెనీలో .. కంపెనీ డెవలప్ చేసిన ఏఐ టూల్స్ వాడటం లేదన్న కారణం చూపి.. వృత్తిరీత్యా ఎన్నో అవార్డులు గెలుచుకున్న సీనియర్ పై సీఈఓ 2 గంటలు ఒత్తిడి చేసినట్లు యూజర్ వివరించాడు. చాలామంది టీమ్ లీడ్స్, ఆర్కిటెక్టుల్ని తొలగించారని వాపోయాడు. అంతా ముగిసిపోయిందని, ఏఐ మోజులో పడి సీనియర్లను పక్కకు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్టుపై ఒక యూజర్ ఘాటుగా రియాక్టయ్యాడు. జూనియర్లు, ఏఐ కలిసి రాసే కోడ్స్ ను అర్థం చేసుకునేందుకు మళ్లీ సీనియరే కావాలని, ఏఐను చూసి ఉద్యోగుల్ని తీసేస్తే.. అదే తిప్పికొడుతుందని శాపనార్థాలు పెట్టాడు.
రేసులో ఉన్న కారును గెలిపించేందుకు మంచి డ్రైవర్ అవసరం ఉన్నట్లే.. నిపుణులైన డెవలపర్ లేకుండా ఏఐతో గొప్ప ఉత్పత్తుల్ని సృష్టించలేరని మరికొందరు నెటిజన్లు అభివర్ణించారు. అమెజాన్ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ కూడా ఏఐ ను ఇండస్ట్రియల్ బబుల్ గా చెప్పడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.






