- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Neem tree: వేప చెట్టు నుంచి ఎగిసిపడుతున్న కల్లు
కల్లు.. తెలంగాణ ప్రజల ఎమోషన్ అనే చెప్పాలి.

దిశ, వెబ్ డెస్క్: కల్లు.. తెలంగాణ ప్రజల ఎమోషన్ అనే చెప్పాలి. ఇక మన చాలా మంది ఈత కల్లు, తాటి కల్లు తాగి ఉంటారు. కానీ, వేప కల్లు గురించి తెలిసిన వాళ్లు తక్కువ మంది ఉంటారు. సాధారణంగా తాటి, ఈత చెట్లకు కల్లు వస్తుందని అందరికీ తెలుసు. కానీ వేప చెట్టుకు కూడా కల్లు వస్తుంది. అయితే, ఇది చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వార్తలు ఎన్నో చూశాం. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో సమాచారం ప్రకారం.. ఓ అడవిలో వేప చెట్టు కొమ్మను ఇటీవల కొట్టేసినట్లుగా ఉంది. ఆ భాగం నుంచి కల్లు బయటికి ఆడగకుండా ఎగిసిపడుతుంది. Nature is Amazing అనే ఎక్స్ ఖాతాలో తాజాగా ఈ వీడియోను పోస్టు చేయగా, వైరల్ అవుతుంది. అయితే, ఈ వీడియో ఏ ప్రాంతానికి సంబంధించినది అనేది తెలియలేదు. ఏదైనా వ్యాధి సోకినప్పుడు లేదా చెట్టు లోపల ఏదైనా రసాయన చర్య జరిగినప్పుడు మాత్రమే వేప చెట్టు నుంచి ఈ విధంగా కల్లు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తాగకూడదని, ఆరోగ్యానికి మంచిది కాదని సూచిస్తున్నారు.






