- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TikToc Went Wrong : సింహంతో టిక్ టాక్స్ వద్దు.. ఇంతకీ ఏమైందంటే..?
ఓ సినిమాలో నందమూరి బాలకృష్ణ.. 'సింహంతో గేమ్స్ వద్దూ' అనే డైలాగ్ చెప్పినట్టు, ప్రస్తుతం నెటిజన్స్ సింహం(Lion)తో టిక్ టాక్స్ (TikToc) వద్దూ అంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఓ సినిమాలో నందమూరి బాలకృష్ణ.. 'సింహంతో గేమ్స్ వద్దూ' అనే డైలాగ్ చెప్పినట్టు, ప్రస్తుతం నెటిజన్స్ సింహం(Lion)తో టిక్ టాక్స్ (TikToc) వద్దూ అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..! పాకిస్థాన్(Pakisthan) లోని లాహోర్(Lahore) లో ఓ యూట్యూబర్ సింహంతో టిక్ టాక్ వీడియో తీసేందుకు ప్రయత్నం చేశాడు. అజీమ్ అనే యువకుడు బ్రీడింగ్ ఫెసిలిటీ సెంటర్లో ఉన్న సింహాల బోనులోకి వెళ్ళి వీడియో తీస్తుండగా.. ఒక్కసారిగా సింహం ఆ యువకుడిపై దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన అతన్ని సెంటర్ నిర్వాహకులు జిన్నా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ వైల్డ్ లైఫ్(Panjab Province WildLife) ఉన్నతాధికారులు స్పందిస్తూ.. సదరు బ్రీడింగ్ ఫెసిలిటీ సెంటర్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. పాక్ లో బ్రీడింగ్ ఫెసిలిటీ సెంటర్లు లీగల్ వ్యవహారమే అని, అయితే నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సింహంతో గేమ్స్ వద్దంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






