- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇదేం క్రీడా స్ఫూర్తి బాస్..! మాగ్నస్ కార్ల్‌సన్ వింత ప్రవర్తన
దోహా వేదికగా జరుగుతున్న FIDE వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్-2025 ఈవెంట్‌లో మరో సంచలనం నమోదైంది.

దిశ, వెబ్‌డెస్క్: దోహా (Doha) వేదికగా జరుగుతున్న FIDE వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్-2025లో సంచలనం నమోదైంది. ప్రపంచ నెంబర్ వన్, ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ (Magnus Carlsen) భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి (Arjun Erigaisi) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ టోర్నమెంట్‌లోని 9వ రౌండ్‌లో అర్జున్ బ్లాక్ పీసెస్‌తో ఆడుతూ.. మాగ్నస్ కార్ల్‌సన్ టైమ్ అవుట్‌లో ఓడాడు. అయితే, గేమ్ చివరి దశలో కార్ల్‌సన్ తన క్వీన్‌ను జారవిడిచి, ఆ తర్వాత టైమ్ లిమిట్ ముగియడంతో అసహనంతో రగిలిపోయాడు. ఓటమిని తట్టుకోలేక మాగ్నస్ చెస్ బోర్డు టెబుల్‌ను పిడికిలితో గట్టిగా కొట్టాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. ఇదేం క్రీడా స్ఫూర్తి అంటూ కార్ల్‌సన్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. ఆటలో గెలుపు-ఓటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకోవాలని కొందరు అతడికి క్లాస్ పీకుతున్నారు. కాగా, కార్ల్‌సెన్ ఈ ఏడాది జూన్‌లో నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్ చేతిలో ఓడిన సమయంలోనూ కార్ల్‌సన్ ఇదేవిధంగా టేబుల్‌ను కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు






