Viral video: ఇదేం బౌలింగ్ రా అయ్యా.. నేను ఎప్పుడూ చూడలేదే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-21 12:55:38  IST  )

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు (Cricket) అత్యధిక మంది అభిమానులు ఉన్నారు.

Viral video: ఇదేం బౌలింగ్ రా అయ్యా.. నేను ఎప్పుడూ చూడలేదే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు (Cricket) అత్యధిక మంది అభిమానులు ఉన్నారు. ఇక క్రికెట్‌లో తరచూగా ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన ఫన్నీ సంఘటనలను చూస్తుంటారు. కానీ, ఇలాంటి బౌలింగ్‌ను ఎప్పుడు చూసి ఉండరు. ప్రస్తుతం నెట్టింట ఓ విచిత్రమైన బౌలింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరు సన్ రైజర్స్‌కు ఇలాంటి బౌలరే కావాలని కామెంట్లు చేయగా, కొందరేమో, వీడు బంగ్లాదేశ్ పాములా ఉన్నాడని సెటైర్లు వేస్తున్నారు.

పంజాబ్‌లో ఇటీవల లోకల్ క్రికెట్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ శైలితో ఆకట్టుకుంటున్నాడు. అసలు ఏ చేతితో బౌలింగ్ చేస్తున్నాడో బ్యాటర్లకు అర్థం కానంత ఇదిగా బౌలింగ్ చేశాడు. ఈ తికమక బౌలింగ్‌తో బ్యాటర్లను వెంట వెంటనే పెవిలియన్ చేర్చుతున్నాడు. ముందు ఎడమ చేతితో బాల్ అందుకున్న ఈ బౌలర్.. చేతులను వెనుకకు, ముందుకు తిప్పుతూ, ఓ చేతి నుంచి మరో చేతికి బాల్‌ను మార్చుతూ చివరికి కుడి చేతితో బౌలింగ్ చేశాడు. ఇదంతా గమనించిన బ్యాటర్‌కు ఏం అర్థం కాకపోవడం, క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఈ యువ బౌలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. మరీ మీరు కూడా ఫన్నీ యూనిక్ బౌలింగ్ (Unique bowling) వీడియోను చూసేయండి.

Click For Tweet Post..

Next Story