ఇదేం పకోడీ రా అయ్యా.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు!

by Yella Dhawani Reddy |

చల్లని సాయంత్రం.. వేడి వేడిగా కరకరలాడే పకోడి.. సూపర్ కాంబినేషన్ కదా.

ఇదేం పకోడీ రా అయ్యా.. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబు!
X

దిశ, వెబ్ డెస్క్: చల్లని సాయంత్రం.. వేడి వేడిగా కరకరలాడే పకోడి.. సూపర్ కాంబినేషన్ కదా. ఇక ఆనియన్ పకోడి, పాలక్ పకోడి, బ్రెడ్ పకోడి, చికెన్ పకోడి.. ఇలా మనకు పకోడిలో ఎన్నో వెరైటీలు తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా చెప్పుల పకోడి ట్రై చేశారా? అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల విన్యాసాలు, ప్రయోగాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వంటల్లో విపరీత ప్రయోగాలు చేస్తున్నారు. ఈ తరహాలోనే ఒక స్ట్రీట్ ఫుడ్ వాలా పకోడి విక్రయిస్తోంది. నార్మల్ పకోడి అయితే తన స్పెషాలిటీ ఏముంటుందని అనుకుందేమో.. చెప్పుల ఆకారంలో ఉండే పకోడిలను చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ డిష్ పేరు కూడా 'జూతా బజా'గా పెట్టింది. ఇక దీన్ని చాలా మంది ఎగబడి మరీ తింటుండటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీన్ని ఆమె కస్టమర్లలో ఒకరు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, వైరల్‌గా మారింది. ఇక ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేం వెరైటీ రా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Next Story