- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీడు మాములోడు కాదు.. ఫ్లైట్ సిబ్బంది అంటూ ఆరేళ్లలో 120 ఉచిత విమాన ప్రయాణాలు!
ప్రజా రవాణా బస్సు, రైలు, విమానం ఏదైనా ప్రతి ప్రయాణికుడూ తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలి. డబ్బులు చెల్లించకుండా ప్రయాణిస్తే, అటువంటి ప్రయాణంపై కఠినమైన చట్టాలు,

దిశ, వెబ్ డెస్క్: ప్రజా రవాణా బస్సు, రైలు, విమానం ఏదైనా ప్రతి ప్రయాణికుడూ తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాలి. డబ్బులు చెల్లించకుండా ప్రయాణిస్తే, అటువంటి ప్రయాణంపై కఠినమైన చట్టాలు, భారీ జరిమానాలు, లేదా జైలుశిక్ష కూడా ఉంటాయి. కానీ, ప్రభుత్వ అధికారుల కోసం మాత్రం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు, రాయితీలు అమలులో ఉంటాయి. దీన్నే ఆసరా తీసుకొని ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. చివరికి జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్లితే..
అమెరికాలోని ఫ్లోరిడాకు (Florida) చెందిన 35 ఏళ్ల టిరాన్ అలెగ్జాండర్ అనే వ్యక్తి ఫ్లైట్ అటెండెంట్‌గా ఫేక్ ప్రొఫైల్ సృష్టించుకున్నాడు. అనంతరం నాన్-రెవెన్యూ ట్రావెల్ (ఉద్యోగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం) పద్దతిలో 2018 నుంచి 2024 వరకు దాదాపు 120కి పైగా విమానాల్లో ఉచితంగా ప్రయాణించాడు. ఇందుకోసం అలెగ్జాండర్ ఒక ఎయిర్‌లైన్‌కు చెందిన అంతర్గత టికెట్ పోర్టల్‌ను ఉపయోగించి ఇతర ఎయిర్‌లైన్స్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకున్నాడు. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు అసలైన విమానయాన సంస్థల ఉద్యోగుల క్రెడెన్షియల్స్‌ను (గుర్తింపు వివరాలను) సంపాదించాడు. వారి బ్యాడ్జ్ నంబర్లను కూడా దొంగిలించి తాను ఆయా సంస్థల ఉద్యోగినని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇలా మొత్తం అతడు 30 వేర్వేరు సైట్ల క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించాడు.
సాధారణంగా విమానయాన సంస్థలకు ఇతర సంస్థలతో పరస్పర ఒప్పందాలు ఉంటాయి. దీనివల్ల ఒక సంస్థ ఉద్యోగులు తమ అంతర్గత ట్రావెల్ బుకింగ్ సైట్ ద్వారా ఇతర ఎయిర్‌లైన్స్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ వ్యవస్థ గురించి తెలిసిన అలెగ్జాండర్ పలు విమానయాన సంస్థల సిబ్బంది వివరాలను సేకరించాడు. వారి ఉద్యోగంలో చేరిన తేదీ, బ్యాడ్జ్ నంబర్, వారు పనిచేస్తున్న సంస్థ పేరు వంటి వివరాలను నమోదు చేసి ఉచిత విమాన ప్రయాణాలను పొందాడు. అలెగ్జాండర్ ప్రధానంగా స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగుల ట్రావెల్ పోర్టల్ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ మోసం బయటపడటంతో అతడిపై వైర్ ఫ్రాడ్ (డిజిటల్ మోసం), ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూర్డ్ ఏరియాలో తప్పుడు సమాచారంతో ప్రవేశించడం అనే రెండు ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.






