Viral news: ఈ డ్రైవరన్న చాలా గ్రేట్.. కస్టమర్లకు అందించే సదుపాయాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-30 05:56:18  IST  )

మనలో చాలా మంది రోజులో ఒక్కసారైనా ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ట్యాక్సీ సేవలను ఉపయోగించుకుంటునే ఉంటారు.

Viral news: ఈ డ్రైవరన్న చాలా గ్రేట్.. కస్టమర్లకు అందించే సదుపాయాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మంది రోజులో ఒక్కసారైనా ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ట్యాక్సీ సేవలను ఉపయోగించుకుంటునే ఉంటారు. ఇక మనం క్యాబ్ బుక్ చేసుకున్నాక ఎంత త్వరగా గమ్యాన్ని చేరుకుంటామా అనే ఆలోచిస్తుంటాం. కానీ, ఈ క్యాబ్ ఎక్కితే మాత్రం అస్సలు అలా ఆలోచించరు. ఎంత ఆలస్యమైనా పర్లేదని హాయిగా ప్రయాణిస్తారు. ఎందుకంటే ఇందులో ఉన్నంతా సేపు మీకు ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అదేలా అనుకుంటున్నారా? ఈ వార్త చదివి తెలుసుకోండి.

ఢిల్లీకి (Delhi) చెందిన అబ్ధుల్ ఖదీర్ (Abdul Qadeer) అనే ఉబర్ (Uber) డ్రైవర్ తన కారులో ప్రయాణికులకు అత్యుత్తమ సదుపాయాలను కల్పిస్తున్నాడు. స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్, వైఫై, పెర్ఫ్యూమ్‌లు, ప్రథమ చికిత్స కిట్, మందులు, టిష్యూలు, చెత్త బుట్ట వంటి అన్నీ సౌకర్యాలను అందిస్తున్నాడు. పైగా అతడు ఇవన్నీ కస్టమర్లకు ఉచితంగా అందించటం విశేషం. ఇందులో ప్రయాణిస్తున్నంత సేపు 1BHK ఇంట్లో ప్రయాణిస్తున్నట్లు ఉందంటూ ఆకాంక్ష షెనాయ్ అనే ఓ నెటిజన్ ట్విట్టర్‌‌లో ఖదీర్ గురించి పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు క్యాబ్ డ్రైవర్‌ను ప్రశంసిస్తున్నారు. డ్రైవరన్న నువ్వు చాలా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొందరు కారులోని వస్తువుల గురించి భద్రతా ఆందోళనలను లేవనెత్తారు. సడెన్ బ్రేక్ వేస్తే వెనక సీటులో కూర్చొన్న ప్రయాణికులకు వాటి వల్ల గాయాలు అయ్యే ప్రమాదముందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఖదీర్ క్యాబ్ బుక్ చేసుకున్న చాలా మంది ప్రయాణికులు సోషల్ మీడియాలో ఇతడిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఎప్పుడు క్యాబ్‌ అవసరం వచ్చినా అతని క్యాబ్‌నే బుక్‌ చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. కొంతమంది అయితే ఖదీర్‌ అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా చెల్లిస్తామని కూడా చెబుతన్నారు. కాగా, ఒకసారి ఒక యువకుడు తన క్యాబ్‌లో ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు అబ్దుల్‌కు దీన్ని ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందట. ఎందుకంటే.. ఆ యువకుడు ఇంటర్వ్యూకి వెళ్లాలనే తొందరలో తన వస్తువులలో కొన్నింటిని మరచిపోయాడు. దీంతో చాలా చోట్ల క్యాబ్‌ను ఆపాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు క్యాబ్‌లోనే అలాంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించుకున్నాడు.


Click For Tweet..

Next Story